మనన్యూస్,జోగులాంబ,గద్వాల:మల్దకల్ మండలం చర్ల గార్లపాడు గ్రామానికి చెందిన వీరేష్ దంపతులు మరణించగా వారి పిల్లలు ముగ్గురు అనాధలు అయ్యారు. వారిని ఆదుకునేందుకు మల్దకల్ జడ్పీ హైస్కూల్లో 1988-89 లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆ పిల్లలకు అండగా నిలిచి రూ. 58వేల ను అందజేసి వారికి అండగా నిలిచారు. అంతేగాక గద్వాలకు చెందిన మానవసేవే మాధవసేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జర్నలిస్టు రామాంజనేయులు రెండు క్వింటాళ్ల బియ్యం, వంట సామాగ్రి, రూ.15వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి నరసింహారెడ్డి లక్ష్మీనారాయణ ప్రేమ రాజ్ రాముడు మురళీధర్ గౌడ్ రామాంజనేయ, స్వామి ఫోటోగ్రాఫర్ సంఘం అధ్యక్షుడు శేఖర్, పద్మరెడ్డి, ఆనందరాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.