మనన్యూస్,గొల్లప్రోలు:జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో ప్రచారాన్ని హోరెత్తించారు.ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తు ప్రతి ఒక్కరూ జనసేన ఆవిర్భావ సభ కు తరలి రావాలని కోరారు.నాయకులు,కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు వెంట రాగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.14 వ తేదీన విజయోత్సవ సభ కు భారీ ఎత్తున తరలి రావాలని విన్నవించారు.పవన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు వేలాది గా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.ప్రతి జనసేన కార్యకర్త ఒక సైనికుడు వలే పని చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వందలాది మంది జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు పాల్గొన్నారు