మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం ప్రతినిధి:రాష్ట్రంలో మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా పనిచేసే నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని నగర పంచాయితీ కౌన్సిలర్ బొదిరెడ్డి గోపి తెలిపారు.ఏలేశ్వరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా సంఘాలు పలువురు మహిళలతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం మహిళలకు అన్ని విధాల అన్యాయం చేసిందని తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే 2025 బడ్జెట్ సమావేశాల్లో మహిళలకు 4332 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.మహిళలకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమని ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఇప్పటికే 10 కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపట్టిందని,దానిలో భాగంగా అరకు టీ వంటి కార్యక్రమాల ద్వారా మహిళలను వ్యాపార రంగాలలో భాగ్య స్వామ్యం చేయనుందని వచ్చే ఉగాదికి పి 4 అని కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తయారు చేసే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.ఒక మహిళగా ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ నియోజకవర్గంలో మహిళలు,డ్వాక్రా సంఘాల పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్,వైస్ చైర్మన్లు వాగు రాజేష్,జొన్నాడ వీరబాబు కౌన్సిలర్లు ఎండగుడి నాగబాబు,కోణాల వెంకటరమణ, ఆనంతారపు రాజు,పెండ్ర శ్రీను,సామంతుల గోపి,కోరాడ కృష్ణ,బుగతా శ్రీను తదితరులు పాల్గొన్నారు.