మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని మక్తల్ మండలం గడ్డంపల్లి గ్రామములోని రైతు వేదిక దగ్గర నిర్వహించినా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంగళ వారం ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రారంబించారు.మక్తల్ నియోజకవర్గ ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేటట్లు నిరంతరం శ్రమిస్తూ నేడు రామ్ రెడ్డి లయన్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో వాకిటి శ్రీహరి సేవ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని సేవాసమితి సభ్యులు తెలిపారు.గడ్డంపల్లి,అనుగొండ గ్రామల కాంగ్రెస్ పార్టీ నాయకుల సమన్వయంతో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,మక్తల్ నియోజకవర్గం విద్యా వైద్యానికి చాలా వెనుకబడిన ప్రాంతమని ఇక్కడి ప్రజలు చాలా బీదరికానికి చెందినవారు అని ఈ సంధర్బంగా గుర్తు చేశారు.ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని కంటి వైద్య శిబిరాల తో పాటు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడంలో తన వంతుగా సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు.ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే మాటతో కంటి చూపుకు లోపం ఉన్న వారికి అయోవృద్ధులైనటువంటి వారికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ,కంటి ఆపరేషన్‌తో పాటు ఉచిత మందులు అద్దాలను అందించడం జరుగుతుందని తెలిపారు.తన యొక్క సేవ సమితి బృందానికి అభినందించారు.సుమారు 135 మందికి పైగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా 75 మందికి పైగా కంటి పొరల్లో ఉన్నట్లు గుర్తించి వారిని ఆపరేషన్ నిమిత్తం కొరకు మహబూబ్‌నగర్ రామ్ రెడ్డి లయన్స్ హాస్పిటల్ కు ప్రత్యేక వాహనంలో తరలించడం జరిగిందని సేవ సమితి సభ్యులు తెలిపారు. అనంతరం సేవాసమితి సభ్యులను గడ్డంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందించారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి ,పద్మ, సత్యం గౌడ్,విజయ్ ,పోలీస్ శాఖ లింగప్ప, గడ్డంపల్లి హనుమంతు, లక్ష్మారెడ్డి,చంద్రకాంత్ గౌడ్,గణేష్ కుమార్, రమేష్,రామాంజనేయులు,కురుమారెడ్డి, శివారెడ్డి,నాగరాజు, నరేందర్, పరశురాం, కొండప్ప, రాము ,ఏ రవికుమార్, నూరుద్దీన్,అసముద్దీన్, బోయ నరసింహ తదితరులు పాల్గొన్నారు.