గద్వాల జిల్లా (మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 12 :- జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా క్రికెట్ పోటీలు . ఈ కార్యక్రమంలో దీపక్ ప్రజ్ఞ మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు అంకితభావంతో రాణించాలని రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడానికి వ్యాయామం అవసరమని అన్నారు ఈ సందర్భంగా అలంపూర్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఈ క్రికెట్ పోటీలకు ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ క్రీడాకారులందరూ అత్యుత్తమ ప్రదర్శన చేయాలని చాలామంది యువత మత్తుకు బానిసగా మారి ఆరోగ్యవంతమైన జీవితం జీవించాల్సిన వయసులో అనారోగ్య బారినపడి వ్యసనాలకు దూరంగా ఉండాలని వ్యాయామ క్రీడలు అలవాటు చేసుకోవడం వలన క్రీడా స్ఫూర్తిని కలిగి ఉంటారని ఇంతటి మంచి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఈ గ్రామ హనుమాన్ యూత్ సోదరులు అందరికీ నిండు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క క్రీడలను ఓపిక సహనం తో పాటు ఆడుకోవాలని ఎలాంటి అవాంఛన ఘటనకు చోటు ఇవ్వకుండా జరుపుకోవాలని క్రీడాకారులకు అందరికీ శుభాకాంక్షలు తెలియపరచారు.. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ దీపక్ ప్రజ్ఞ జోగులాంబ గద్వాల జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, 10వ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య , అలంపూర్ తాలూకా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జోగుల రవి , ఎర్రవల్లి మండల అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ , మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప , వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ , అడ్డాకుల రాము, పెద్దలక్ష్మన్న, ఆలయ ధర్మకర్త నాగ శిరోమణి , జోగుల సరస్వతి , జగన్మోహన్ నాయుడు , గోపాల్ , రాజకుమార్ , కృష్ణ కాంత్ , సబ్ ఇన్స్పెక్టర్ రాజు , కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎర్రవల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.