మన న్యూస్,తిరుపతి, మార్చి 10:- సంఘసంస్కర్త సావిత్రి భాయి పూలే 128వ వర్థంతి సందర్భంగా సోమవారం ఉదయం మహిళా యూనివర్సిటీ సమీపంలో బిసి సంఘర్షణ సమితి ఏర్పాటు చేసిన ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాళులు అర్పించారు. ఆధునిక విద్య ద్వారానే మహిళల అభివృద్ధి సాధ్యమని నమ్మి జీవితాంతం కృషిచేసిన గొప్ప నాయకురాలు సావిత్రి భాయి పూలే ఆయన అన్నారు. పితృ స్వామ్య వ్వస్థకు వ్యతిరేకంగానే కాకుండా మహిళల హక్కుల కోసం పోరాడిన సంస్కర్త సావిత్రి భాయి పూలే అని ఆయన తెలిపారు. ఎన్నో స్కూల్స్ ఏర్పాటు చేసి మహిళలకు, నిమ్న వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప మానవతా వాది సావిత్రి భాయి పూలే అన్నారు. ఈ కార్యక్రమంలోమేయర్ డాక్టర్ శిరీష, టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, బిసి సంఘర్షణ సమితి అధ్యక్షులు అక్కినపల్లి లక్ష్మయ్య, సాకం ప్రభాకర్, గుండ్లూరు వెంకటరమణ, కరాటే చంద్ర, ఆవులపాటి బుజ్జి బాబు, కట్టమంచి చంద్రబాబు, నరసింహ యాదవ్, జనసేన నాయకులు ఎస్ కే బాబు, రాజా రెడ్డి, మనస్వామి, ధరణి తదితరులు పాల్గొన్నారు.