మన న్యూస్, తిరుపతి,మార్చి 10 :- త్వరలో తిరుపతి నుంచి అయోధ్య వరకు కొనసాగే శ్రీరామ రథయాత్రకు రావలసిందిగా మహారాష్ట్రకు చెందిన శ్రీ కల్కి భగవాన్ ను ఆహ్వానిస్తూ రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన దక్షిణ భారతదేశ బాధ్యులు కృష్ణ కిషోర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుకుమార్ రాజు లు శ్రీవారి ప్రసాదాన్ని అందజేసారు. ఇటీవల మధ్యప్రదేశ్ దాతీయాలో జరిగిన జాతీయస్థాయి సమావేశంలో కల్కి స్వామీజీని కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠం తిరుపతి నుంచి కొనసాగే శ్రీ రామ రథయాత్రకు తన వంతు సంపూర్ణ సహకారం అందజేస్తామన్నారు. ప్రారంభం నుంచి రథయాత్ర కొనసాగే చివరి వరకు తన బృందం అందుబాటులో ఉంటుందన్నారు. ఇందులో భాగస్వామి కావడం, మీరు ఆహ్వానించడం భగవంతుని అనుగ్రహంగా భావిస్తున్నామన్నారు.