మన న్యూస్,తిరుపతి,మార్చి 10 :- ప్రశాంతంగా హైందవ సంప్రదాయం ప్రకారం హిందువులు తమ పండుగలను జరుపుకుంటుండగా రాయచోటి లో జరిగిన ముస్లిం ముష్కరుల దౌర్జన్యకాండ దురదృష్టకరమని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి సుకుమార్ రాజు అన్నారు. సోమవారం తిరుపతి జిల్లా కేంద్రం ఆర్డీవో కార్యాలయం వద్ద విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆర్ హెచ్ వి ఎస్ ప్రతినిధిగా సంఘీభావం తెలిపి ముస్లింల అరాచకాలను ఖండించారు. స్థానిక పోలీసులు హిందువులపై కేసు పెట్టడం అన్యాయమని ఆ పోలీసులను సస్పెండ్ చేయకపోతే చలో రాయచోటి కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. బిజెపి అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ హైందవ ధర్మం కోసం ప్రాణాలర్పిస్తామన్నారు. ఎస్సైను విధుల నుంచి తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అధిక సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొన్నారు.