మన న్యూస్ లింగంపేట్ 13:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మండల కేంద్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ,కి నేడు లింగంపేట్ మైనారిటీ రెసిడెన్సీషియల్ పాఠశాల విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపార స్థానిక నాయకులతో కలిసి గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే, అనంతరం ఎమ్మెల్యే , మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో ఉన్నతంగా రాణించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే, అన్నారు. గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో డ్రాపవుట్స్‌ను తగ్గించడంలో ముఖ్యంగా యువత కృషి చేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను రెండవ విడత లో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మంజూరు చేయాలనీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారిని కోరినట్టు తెలిపారు.