మనన్యూస్,సరూర్ నగర్:అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎల్బీనగర్ డిసిపి జోన్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా సిబ్బందిని సీఐ సైధి రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు,సిబ్బంది ఘనంగా సన్మానించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.