మనన్యూస్,నెల్లూరు:ఇటీవల అగ్ని ప్రమాదం జరిగి ల్యాండ్రి బండిని కోల్పోయిన నెల్లూరు మూడో డివిజన్ వైసీపీ కార్యకర్త ధోబి ప్రసాద్ నేడు ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అండగా నిలిచి నూతన ల్యాండ్రి బండిని అందజేశారు.నూతన ల్యాండ్రీ బండిని అందుకున్న ప్రసాద్ చంద్రశేఖర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రసాద్ తిరిగి తన వృత్తిని కొనసాగించుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా కుటుంబ పోషణ జరుపుకోవాలని చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు.