మనన్యూస్,కాకినాడ:జనసేన పార్టీ ఆవిర్భావ సభకు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గం చిత్రాడ గ్రామంలో 12వ ఆవిర్భావ సభ నభూతో నా భవిష్యత్తు అన్న రీతిగా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి,రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శనివారం కాకినాడ సిటీలో కుళాయి చెరువు ప్రాంగణంలో ఉన్న గోదావరి కలక్షేత్రం లో ఆవిర్భావ సభకు వచ్చే వారికి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు ఆ కమిటీలకు ఎప్పటికప్పుడు దిశానిద్దేశం చేసేందుకు కంట్రోల్ రూమ్ ను మనోహర్ ప్రారంభించారు ఆవిర్భావ సభకు వచ్చే ఇరు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాల నుంచి వచ్చే జనసైనికులు వీర మహిళలు నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు వారె ఎవ్వరికీ ఏ విధమైన ఇబ్బందులు కలవకుండా చూసేందుకు ఎప్పటికప్పుడు ఈ కంట్రోల్ నుంచి తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ తో సహా అందరూ పర్యవేక్షిస్తారని మనోహర్ తెలిపారు ,ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలందరూ ఇప్పుడిప్పుడే రాక్షకపాల నుంచి ఊపిరి పీల్చుకుంటున్నారని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పథకాలు ద్వారా ప్రజలకు మంచి చేసేందుకు తమ ప్రయత్నిస్తుంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో మాత్రం తమ చిన్నాన్న ను చంపిన వారిని సాక్ష్యలను ఒకొక్కరిణి అంత మోందెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని కనీసం శాసనసభకు వచ్చి ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆలోచించే కనీస జ్ఞానం లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని అన్నారు, ఏది ఏమైనా తమ పార్టీ ఆవిర్భావ సభ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందని ఆ విధంగా అన్ని ఏర్పాట్లు తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏర్పాట్లు చేస్తున్నట్టు దానికి తమ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త కష్టపడి శ్రమిస్తున్నారని మనోహర్ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ ఆవిర్భావ సభ జరిగిన 12 సంవత్సరాల కాలంలో పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని తగిన సముచిత న్యాయం చేస్తామని అన్నారు,ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, శాసనసభ్యులు పంతం నానాజీ,బత్తుల బలరామకృష్ణ,నిమ్మల జయ కృష్ణ,లోకం మాధవి,కొత్తపల్లి సుబ్బారాయుడు,పంచమట్ల ధర్మరాజు,సుందరపు విజయ్ కుమార్,సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్,ఎమ్మెల్సీ హరిప్రసాద్,కౌడ చెర్మన్ తుమ్మల బాబు,తదితరు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.