Mana News :- ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాజధాని పనులు ఈ నెల 15 లోగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే టెండర్లను పిలి చింది. దాదాపు రూ 40 వేల కోట్ల విలువైన పనులు ప్రారంభిస్తోంది. కేంద్రం ఇప్పటికే అమరావతి ప్రత్యేక రైల్వే లైన్ కు ఆమోదం తెలిపింది. ఇప్పుడు అమరావతితో పాటుగా శ్రీకాకుళంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటు దిశగా కసరత్తు మొదలైంది. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు :- రాజధాని అమరావతి కేంద్రంగా గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఒకటి అమరావతిలో.. మరొకటి శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటుచేయాలని ఆలోచన చేస్తోంది. ఇందు కోసం ప్రీ-ఫీజిబిలిటీని పరిశీలించేందుకు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక (టీఈఎఫ్ఆర్) రూపొందించేందుకు కన్సల్టెంట్ల నియామకానికి ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీ) టెండర్లను ఆహ్వానించింది. ఆన్లైన్లో టెండర్ల దాఖలుకు ఈ నెల 21 వరకు గడువు ఇచ్చింది. ఈ నెల 24న సాంకేతిక బిడ్లు, 27న ఫైనాన్షియల్ బిడ్లు తెరవనుంది. అమరావతి అంతర్జా తీయ విమానాశ్రయం ఏర్పాటుకు ఏ ప్రాంతం అనుకూలమో కూడా కన్సల్టెన్సీ సంస్థే సూచించా లని నిబంధనల్లో పేర్కొంది. ఏ విధానంలో వెళ్లాలి :- శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరానికి సమీపంలో నిర్మించనున్నట్లు ఏపీఏడీసీ వివరించింది. తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా విమానాశ్రయాల నిర్మాణానికి కాన్సెప్ట్ మాస్టర్‌ప్లాన్, ఫైనాన్షియల్ మోడల్, ప్రాజెక్ట్ స్ట్రక్చర్లను రెడీ చేయాలని తెలిపింది. ఒక్కో విమానాశ్రయ నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంత.. ఎన్ని దశల్లో వీటిని చేపట్టాలనేది సూచించాలని స్పష్టం చేసింది. అదే విధంగా ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యం, జాయింట్ వెంచర్ వంటి విధానాల్లో దేనిని అనుసరిస్తే ప్రయోజనం ఉంటుందో సూచించాలని పేర్కొంది. ఈ రెండు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం ..అంచనాలను సిద్దం చేయాలని సూచించింది. మాస్టర్ ప్లాన్ :- విమానాశ్రయాలకు రాష్ట్రంలో భవిష్యత్ లో ఉండే డిమాండ్.. ఏయిర్ ట్రాఫిక్ వృద్ధి ఎలా ఉంటుం దనే అంశాలనూ శోధించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి అందించాల్సిన ప్రోత్సాహ కాల పైన సూచనలు చేయాలని నిర్దేశించింది. విమానాశ్రయాలకు చేరుకునేందుకు అభివృద్ధి చేయా ల్సిన రవాణా మార్గాలపైనా కన్సల్టెన్సీ సంస్థలు రిపోర్ట్ ఇవ్వాలని సూచించింది. రాబోయే 35 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాన్సెప్ట్ మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని వివరించింది. ఏపీఏ డీసీ పేర్కొన్న అంశాల మేరకు నివేదికలు వచ్చిన తరువాత అమరావతి, శ్రీకాకుళంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటు పైన తదుపరి నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.