బంగారుపాళ్యం మార్చ్ 8 మన న్యూస్
మండల కేంద్రంలోని బంగారు పాల్యం ప్రాథమిక పాఠశాల నందు నెహ్రు యువ కేంద్రం చిత్తూరు, గ్రేడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నెహ్రూ యువ కేంద్రం సమన్వయకర్త ప్రదీప్ బెహరా, మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని, మహిళ గనుక లేకపోతే మానవజాతి లేదని, అటువంటి మహిళ ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారని, అటువంటి మాతృమూర్తిని స్మరించుకొనే దినమే మహిళా దినోత్సవం అని కొనియాడారు. అనంతరం గ్రేడ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ శేషాద్రి మాట్లాడుతూ మహిళలు అని రంగాల్లో ముందున్నారని, ఒక బలమైన స్త్రీ తనకోసమే కాకుండా ఇతరుల కోసం కూడా నిలబడి పోరాడుతుందని, స్త్రీలే సమాజానికి నిజమైన వాస్తు శిల్పులు, అని ఇంటి నుండి ఆఫీసుల వరకు మహిళలు దేనినైనా మహిళలు అందంగా నిర్మించగలరని, అలాంటి మహిళలకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు కలదని అలాంటి వారిని గ్రేడ్స్ సంస్థ తరఫున సత్కరించడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి సేవా కార్యక్రమాలు గత 30 సంవత్సరాలుగా సమాజ సేవకు అంకితమై సంస్థ పనిచేస్తుందని కొనియాడారు. అనంతరం సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించి, మరియు వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయ మహిళలకు కార్మికులకు ఐసిడిఎస్ హెల్త్ వర్కర్లకు, మహిళ పోలీసులకు, బంగారుపాళ్యం స్థానిక సర్పంచ్ ఎంబి ఉమాదేవి, గ్రేడ్స్ సంస్థ తరఫున మహిళను సత్కరించి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి, సిఆర్పి సుశీల, ఉపాధ్యాయులు హేమచంద్ర, గ్రేట్ సంస్థ సిబ్బంది దొరబాబు, మహిళ గ్రూపు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.