Mana News :- అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మార్కాపురంలో పర్యటించారు. మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మార్కాపురం జిల్లా చేస్తామని వెల్లడించారు. మార్కాపురంను జిల్లా చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో నంద్యాలను జిల్లాగా చేసినా, మార్కాపురంను ప్రకాశం జిల్లాలోనే ఉంచారు. ఇవాళ చంద్రబాబు కొత్త జిల్లాపై స్పష్టమైన హామీ ఇచ్చారు.