స్వయంకృషితో వివిధ రంగాలలో స్థిరపడిన మహిళలను శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే
మనన్యూస్,పినపాక నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి పలువురు మహిళలను శాలువాతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం అనంతరం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన రింగ్ ఆటల పోటీలో 40 టీములు పాల్గొనగా అందులో ఫైనల్ కి చేరుకుని గెలుపొందిన గద్దల ఆదిలక్ష్మి, ఉష కి, రన్నర్ గా నిలిచిన ధనలక్ష్మి జయప్రభ ని అభినందించి బహుమతులు అందజేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక వేసులు పాటు ఆర్థిక ఎదుగుదలకు వివిధ కార్యక్రమాలు చేపట్టి సపోర్ట్ చేస్తున్నదని పాయం వివరించారు ప్రజా ప్రభుత్వాన్ని మహిళలు అంతా ఆశీర్వదించాలని కోరారు ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఇచ్చిన గౌరవం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని, ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం, మహాలక్ష్మి ద్వారా 500 గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్, మహిళల పేరిట ఇందిరమ్మ ఇల్లు, ప్రజా ప్రభుత్వం చేపట్టిన విజయమని పేర్కొన్నారు ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని అన్ని రంగాలలో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలియజేసి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ , నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి ,నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి , మణుగూరు మండలం కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య , బూర్గంపాడు మండలం మహిళా అధ్యక్షురాలు భూక్య సుగుణ , మాజీ సర్పంచ్ తాటి సావిత్రి మణుగూరు టౌన్ అధ్యక్షులు శివ సైదులు ,మణుగూరు శివాలయం గుడి చైర్మన్ కూచిపూడి బాబు , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు