గొల్లప్రోలు మార్చి 8 మన న్యూస్ : - మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా ప్రగతి సాధిస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గొల్లప్రోలు లోని మెప్మా కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి మర్రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని రంగాలలో పురుషుల కంటే మహిళలే ముందంజలో ఉన్నారన్నారు. మహిళలు తమ అభిరుచికి అనుగుణంగా అభివృద్ధి సాధించేందుకు కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని 16 మహిళా సంఘాలకు2 రెండు కోట్ల 75 లక్షల రూపాయల విలువైన చెక్కును ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారిణి భారతి, నగర పంచాయతీ మాజీ చైర్ పర్సన్ శీరం మాణిక్యం, మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు, కౌన్సిలర్లు మైనం భవాని, గుళ్ల సుబ్బారావు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షురాలు వినకొండ అమ్మాజీ పలు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. స్వచ్ఛ గొల్లప్రోలు ఆధ్వర్యంలో..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్వచ్ఛ గొల్లప్రోలు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ నగర్ లోని స్వామి వివేకానంద జ్ఞాన మందిరంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ అశ్వనీ తేజను ఘనంగా సత్కరించి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళలు బహిరంగంలోనూ ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్వచ్చ గొల్లప్రోలు కన్వీనర్ కొసిరెడ్డి రాజా, ప్రముఖ యోగా గురువు జ్యోతుల నాగేశ్వరరావు, స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు కొమ్ము సత్యనారాయణ, చోడ పునీడి పుల్లపురాజు, దాడి పద్మనాభం,గుదే నాగు, మలిరెడ్డి నారాయణరావు, పెదిరెడ్ల వెంకటరాజు, భారతాల శేషారావు, కంకటాల వాసు, మలిరెడ్డి సత్యనారాయణ, వేమనబంది కృష్ణంరాజు, మైనం రాజశేఖర్, పెద్ది శెట్టి మహేష్, కీర్తి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.