సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి
పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం
మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:మణుగూరు సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని,మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే అది సాధ్యమవుతుందని,సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి అన్నారు.శనివారం ఆయన మణుగూరు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
శ్రీ కర్నె సోమయ్య నాగమ్మ దంపతులు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్, గ్రామ పంచాయతీ లలో పనిచేస్తున్న పరిశుద్ధ మహిళ కార్మికులను ముఖ్య అతిథిలుగా విచ్చేసిన వలశాల.రామారావు,మణుగూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పిండగ.వెంకట్ కార్యదర్శి మారుతి శ్రీనివాస్,మాలెటీ.బాస్కర్ ఈరెల్లి కీశోర్ దామ్మల్ల.వెంకన్న, సాగర్ యాదవ్,మున్సిపాలిటీ సిబ్బంది కలిసి ఘనంగా శాలువా తో సన్మానించి
వారికి చీరలు పండ్లు పంపిణీ చేసామని తెలిపారు.మహిళ ఆది పరాశక్తి రూపం అని,నారీ శక్తి ముందు ఏ శక్తి నిలువ లేదని నారీ శక్తిని ప్రపంచానికి చాటుదామని ఆయన పిలుపునిచ్చారు.మహిళలు అన్ని రంగాల్లోనూ తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారని ,కుటుంబ పోషణలో,అభివృద్ధిలో ఇవాళ మహిళలది కీలక పాత్ర పోషిస్తు
న్నట్లు తెలిపారు.మహిళ అను
కుంటే ఏదైనా సాధించగలదన్నా
రు. మహిళా దినోత్సవం స్ఫూర్తిని ప్రతీరోజు కొనసాగించాలని కోరారు.