త్వరలో తిరుపతి నుంచి అయోధ్యకు శ్రీరామరథ యాత్ర
మనన్యూస్,తిరుపతి:భారతదేశ ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని నిరంతరం విశ్వవ్యాప్తి చేయడానికి రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ సంస్థ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ చంద్ర ద్వివేది (రాజు భయ్యా),నవీన్ చంద్ర శుక్ల,కల్కి భగవాన్,కృష్ణ కిషోర్, గొర్రె శ్రీనివాసులు,పూజ సింగ్,మధ్యప్రదేశ్ రాష్ట్రీయ ప్రబారి డాక్టర్ మయాంక్ తెంగుల లు వెల్లడించారు. మధ్యప్రదేశ్ దాతీయ జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన మూడవ జాతీయ సదస్సులో వారు మాట్లాడుతూ త్వరలో తిరుపతి నుంచి అయోధ్య వరకు శ్రీ రామ రథయాత్రను ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, హిందూ భావజాలలను క్షేత్రస్థాయిలో ప్రతి గడప కు చేరేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో భారతదేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ఆర్ హెచ్ వి ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. తిరుపతి నుంచి రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన అధికార ప్రతినిధులు సుకుమార్ రాజు, శ్యామల లు హాజరయ్యారు. వీరిని వారు ఘనంగా సన్మానించారు. తెలుగు ప్రజలు ఈ రథయాత్రలో అధిక సంఖ్యలో భాగస్వాములు అయ్యేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.