మనన్యూస్,తిరుపతి:అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జీవకోనలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ బాలికల వసతిగృహం విద్యార్థులకు ఒక నెలకు అవసరమయ్యే నిత్యావసర సరుకులను శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఉచితంగా అందజేశారు.వాకర్స్ అధ్యక్ష కార్యదర్శులు సాంబశివారెడ్డి వెంకటేశ్వర్లు కోశాధికారి కృష్ణకుమూర్తి ఆధ్వర్యంలో కార్పొరేటర్ అన్న అనిత చేతుల మీదుగా వితరణ చేశారు.స్థానిక రామకృష్ణ మిషన్ స్వామి సత్వస్థానంద మహారాజ్ అనుగ్రహ భాషను చేసి ఆశీర్వదించారు. అనంతరం మహిళలను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వీరితోపాటు రామకృష్ణ సుశీలమ్మ, జానకమ్మ,శ్యామలమ్మ, హిమజ, ఆవాశియా విద్యాలయ బాలికలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.