మనన్యూస్,నారాయణ పేట:అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు,మహిళా దినోత్సవం సందర్భంగా మక్తల్ నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మక్తల్ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో మహిళా డాక్టర్లకు స్టాప్ నర్సులకు శానిటేషన్ వర్కర్స్ కు శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది,ఇట్టి సన్మాన కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసంగిస్తూ,కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎంతోమంది కరోనా బాధితులను ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు నర్స్ లకు,శానిటైజర్స్ వర్కర్స్ కు సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తూ,సన్మానానికి అవకాశం కల్పించినందుకు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ వినుత గారికి ధన్యవాదాలు తెలపారు.యత్ర నార్యస్తు పూజ్యంతే రామంతే తత్ర దేవతాం,మహిళలను గౌరవించే చోట దేవతలు నివసిస్తారు అని అన్నారు.పూర్వులు,మన పురాణాలలో మహిళను శక్తి స్వరూపునిగా వర్ణించారు,సమాజానికి మొదటి గురువు మహిళా,మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ అంతర్జాతీయ ప్రఖ్యాతలు పొందుతున్నారని అన్నారు.తెలంగాణ తల్లి స్ఫూర్తిగా కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఏనుముల రేవంత్ రెడ్డి నేడు ప్రారంభిస్తున్నారని తెలిపారు.ఇట్టి సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సివిల్ ఆస్పత్రి సిబ్బంది పాల్గొనడం జరిగింది.