Mana News :- చిత్తూరు జిల్లా, నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన ప్రజల నుంచి తన కార్యాలయంలో వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా సమస్యలను సవివరంగా తెలుసుకొని ఆ సమస్యలకు త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపాలని అధికారులకు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.