మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ విస్తృతస్థాయి సమావేశం ఏలేశ్వరం ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షులు రమణరాజు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాసరావు,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కే.శ్రీనివాసరాజు,జోనల్ అధ్యక్షులు డిఎంఆర్ రాజు (జోన్ -2),జోనల్ కార్యదర్శి ఏ.రామారావు(జోన్-2)లు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఆర్టీసీ అధికారులు ఉద్యోగులకు విధిస్తున్న అన్యాయమైన, అక్రమ పనిస్మెంట్లను దుయ్యబట్టారు. ముఖ్యంగా ఏలేశ్వరం డిపో మేనేజర్ టిమ్ డ్రైవర్ ఎస్వీ రమణ ను, కాకినాడ డిపో మేనేజర్, టిమ్ డ్రైవర్ ఆర్ అబ్బులను, 1/2019 సర్కులర్ కు విరుద్ధంగా సస్పెండ్ చేయడం, విసి అండ్ ఎండి ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడం ఏమిటని, ఇంకా ఉద్యోగులు ఇతర డిపోలకు రిలీవింగ్ పేరుతో ఏకపక్షంగా పంపివేయడం, ఆర్టీసీ ఆదాయ వనరుగా ఉన్న డ్రైవర్, కండక్టర్లను ఈపీకే, కేఎంపిఎల్, పేరుతో వేధించడం, సర్కులర్ ఉన్న సిక్కులపై జీతాలు ఇవ్వక నిరాకరించడం, సర్కులర్ ప్రకారం మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వకపోవడం ఏమిటని, ఆర్టీసీ అధికారులు సిబ్బందిని మానసికంగా ఒత్తిడికి గురి చేయడం వలన చాలా మంది అనారోగ్యం పాలై చనిపోవడం జరుగుతుందన్నారు.అంతేకాకుండా ఆర్టీసీ అధికారులు ఈ వేధింపులు ఆపాలని ముఖ్యంగా డ్రైవర్ ఎస్ వి రమణను, డ్రైవర్ ఆర్ అబ్బులు వై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసి,తక్షణమే డ్యూటీ లోకి తీసుకొని పక్షంలో ఈ ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా నిర్ణయం తీసుకుంటుందని అవసరమైతే ప్రభుత్వం వద్దకు వెళ్లి సమస్య శాశ్వత పరిష్కారం కొరకు రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కార్యదర్శి ఏవి రావు,ఏలేశ్వరం డిపో అధ్యక్షులు కే.కామేశ్వరరావు,కార్యదర్శి కే. త్రిమూర్తులు,కాకినాడ డిపో అధ్యక్షులు గోవిందు,కార్యదర్శి చక్రం,తుని డిపో అధ్యక్షులు ఎమ్మెస్ ఎన్ రాజు,కార్యదర్శి సాయిరాం,ఏలేశ్వరం,కాకినాడ,తుని డ్రైవర్లు,కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు.