మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి
బ్రాందీ షాప్ ముందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అర్ధనగ్న నిరసన-ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరచూరి రాజేంద్ర బాబు రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు తిరుపతి రూరల్ మండలం సాయి నగర్ గ్రామపంచాయతీ రెసిడెన్షియల్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాందీ షాపును తక్షణమే లైసెన్స్ ను రద్దు చేయాలి ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరచూరి రాజేంద్ర బాబు రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు డిమాండ్ చేశారు .తిరుపతి శ్రీ పద్మావతి బైరాగి పట్టెడ రోడ్డు నుండి అవిలాలకు పోయే దారిలో రెసిడెన్షియల్ ఏరియాలో మధ్య బ్రాందీ షాప్ పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐవైఎఫ్ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ బ్రాందీ షాపుకు వ్యతిరేకంగా అర్థనగ్న నిరసన నిర్వహించారు ఈ సందర్భంగా పరుచూరి రాజేంద్ర బాబు కత్తి రవి తిరుపతి రూరల్ సాయి నగర్ గ్రామపంచాయతీ లో తిరుమల తిరుపతి దేవస్థానం లో పనిచేస్తున్న ఉద్యోగులు పనిచేసే విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివాసం ఉంటున్నారని అదే పద్ధతులలో ఓ పక్క 50వేల మంది పైగా అప్పులు తీసుకుంటున్నటువంటి ఇండియన్ బ్యాంకు మరోపక్క 60 పడకల హాస్పిటల్ సుమారు మూడు స్కూల్లు ఇక్కడ నడుపుతున్నాయని ఇలాంటి ప్రాంతంలో బ్రాందీ షాప్ పెట్టడానికి ఎక్సైజ్ అధికారులు ఎలా అనుమతిని మంజూరు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు ఆవిలీల సాయి నగర్ చెందిన విద్యార్థులు స్కూలుకు కాలేజీకి వెళ్లాలంటే మందుబాబుల భయాందోళనకు గురవుతున్నారు మహిళలు రోజు వెయ్యి మంది అప్పులు కోసం ఇదే దారిలో వచ్చి బ్యాంకులో డివైడర్ పైన కూర్చుంటారని ఇక్కడ మద్యం తాగి రోడ్డు మీదనే విచ్చలవిడి గా అసాంఘిక చర్యలు పెరిగిపోయి శాంతి భద్రతలకు విగాథం కలిగే ప్రమాదం ఉన్నందున ఇక్కడ బ్రాందీ షాపు అనుమతిని రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎక్స్చేంజ్ అధికారులు చెప్పిన చూచిచూన్నట్టు వ్యవహరించడం సరైంది కాదని అందుకోసమే అసలు వారు పోరాటానికి పిలుపునిచ్చామని తెలియజేశారు. రాబోయే కాలంలో ఈ బ్రాందీ షాపుని ఇలానే నడిపితే స్థానిక నివాస ప్రజలను, విద్యార్థులను ఏకం చేసి ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షా కార్యదర్శి ఏ జయకృష్ణ ఎం రామకృష్ణ, ఏఐవైఎఫ్ నాయకులు తుండు మల్లికార్జున్ నాగరాజు శ్రీనివాసులు పట్టణ కార్యదర్శి పూర్ణ వీరబాబు మునేశ్వర్ విక్రం మనీ తదితరులు పాల్గొన్నారు