మనన్యూస్,నారాయణ పేట:మక్తల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాలలోని మహిళా అధ్యాపకులకు,విద్యార్థినిలకు ఆట పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ,మహిళలు సాంఘిక ఆర్థిక రంగాల్లో సాధికారత సాధించాలని అన్నారు.మహిళల కష్టానికి తగిన ఫలితం దక్కితేనే నిజమైన మహిళా దినోత్సవం అన్నారు. ఈ కార్యక్రమంలో హరిశ్చంద్ర,తిరుపతి,నర్సోజి,జాంగీర్,లింగప్ప,బాలరాజ్ లక్ష్మీకాంత్,రమేష్,మహేష్ సులోచన,రాజేశ్వరి, నాగేంద్రమ్మ, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.