సీఎం,ఏఐసీసీ ఇంచార్జికి విజ్ఞప్తి చేసిన పినపాక మండల కాంగ్రెస్ అధ్యక్షులు
మనన్యూస్,పినపాక:నియోజకవర్గం పాడె మీదున్న కాంగ్రెస్ పార్టీకి ప్రాణప్రతిష్ట చేసిన ప్రజానేత పోడెం వీరన్న అని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం అన్నారు.తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చ లేని నాయకులు వీరన్న అని కొనియాడారు. పార్టీమారితే పదవులు ఇస్తామని ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తానని కొందరు బి.ఆర్.ఎస్ నాయకులు ప్రలోభ పెట్టిన తనపై రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చిన,నమ్ముకున్న పార్టీనే తల్లిలా భావించి ప్రలోభాలకు లొంగకుండా నిస్వార్ధంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న నిరాడంభరజీవి అని కొనియాడారు. ఎమ్మెల్యే కోటాలో పోడెం వీరయ్యకు ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర మంత్రిగా పదవి ఇవ్వాలని కోరారు.జీవితమే పార్టీ, పార్టీనే జీవితంగా జీవిస్తున్న వీరన్నకు తెలంగాణ ప్రభుత్వం లో సమూచిత స్థాన కల్పించి గౌరవించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ లకు విజ్ఞప్తి చేసారు.