మనన్యూస్,అబ్దుల్లా పూర్:మెట్టు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కి మరింత ఆదాయం చేకూరుస్తాం.మార్కెట్ కమిటి చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయం లో శుక్రవారం ఏర్పాటు చేసిన పాలకవర్గం సమావేశంలో 2025 -26 కి సంబంధించిన బడ్జెట్ కి ఆమోదం.బడ్జెట్ ప్రతిపాదనలను తీర్మానం చేసి పై అధికారులకు పంపిన పాలకవర్గం.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.2025 -26 కి సంబంధించిన సంవత్సరానికి మార్కెట్ పాలకవర్గం హాజరై బడ్జెట్ కి ఆమోదముద్ర వేసి ప్రతిపాదనలను పై అధికారులకు పంపించామని అన్నారు.గడ్డి అన్నారం మార్కెట్ ను మరింత లాభాల బాట లో ఉంచుతామని అన్నారు.రైతు ని సంతోషంగా ఉంచడమే మా ధ్యేయం అన్నారు.వచ్చే మామిడి సీజన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు..కనీస సదుపాయాలు కల్పిస్తామని..ఇప్పటికే అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి రైతులకు వర్తకులకు సమన్వయము ఉండేలా చూస్తున్నామని అన్నారు.కోహెడ మార్కెట్ కి సంబంధించి ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని..ప్రాజెక్ట్ డీపీఆర్ ఇప్పటికే పూర్తి అయ్యిందని..పాలన పరంగా అనుమతులు రాగానే గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు తో శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి వైస్ చైర్మన్,బాస్కర చారి.మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ,శ్రీనివాస్.పాలకవర్గం సభ్యులు బండి మధుసూదన్ రావు.రఘుపతి రెడ్డి.జైపాల్ రెడ్డి.అంజయ్య.లక్ష్మి.నరసింహ.గోవర్ధన్ రెడ్డి.నవరాజ్.గణేశ్ నాయక్.మచ్చెందర్ రెడ్డి.వెంకటేశ్వర్లు గుప్తా.ఇబ్రహీం తో పాటు మార్కెట్ కమిటీ అధికారులు హర్ష..రాజ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు.