మనన్యూస్,నారాయణ పేట:పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏ.రవికుమార్ గారి ఆధ్వర్యంలో మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుల సహకారంతో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో గల షరీఫా మజీద్ లో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది,ఇట్టి ఇఫ్తార్ విందులో మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకటి శ్రీహరి పాల్గొన్నారు, ఇట్టి ఇఫ్తార్ విందును పురస్కరించుకొని ఎమ్మెల్యే ప్రసంగిస్తూ, మైనార్టీ సోదరులకు రంజాన్ మాసం చాలా పవిత్రమైన మాసం నెలరోజుల కఠినమైన ఉపవాస దీక్ష చేస్తున్న మైనార్టీ సోదరులకు రంజాన్ మాసం పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలపడం జరిగింది.మక్తల్ ప్రాంతం మత సామరస్యాలకు ప్రతీక హిందూ& ముస్లిం అన్నదమ్ముల కలిసిపోతూ ఒకరి పండుగలకు మరొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం ఇక్కడి ప్రాంత ప్రజల సంస్కృతి అన్నారు.గత కొద్ది సంవత్సరాల నుండి ఇక్కడి షరీఫా మసీదులో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్న మక్తల్ టౌన్ అధ్యక్షులు రవికుమార్ గారిని ఎమ్మెల్యే అభినందించారు. మైనార్టీ సోదరులతో ప్రత్యేకంగా ఎమ్మెల్యే విజ్ఞప్తి చేస్తూ తమ ప్రార్ధన సమయంలో అల్లా దీవెనలు మక్తల్ నియోజకవర్గం ప్రజలపై ఉండాలని, మక్తల్ ప్రాంతం అభివృద్ధి చెందాలని, రైతులకు పంటలు బాగా పండాలని, ఆరోగ్యపరంగా అందరూ బాగుండాలని, అనారోగ్యంగా ఉన్న వారు త్వరగా ఆరోగ్యంగా కోలుకోవాలని, దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఇట్టి పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థన సమయంలో అల్లాతో ప్రార్థనలు చేయాలని మైనార్టీ సోదరులతో కోరడం జరిగింది, ఇఫ్తార్ సమయంలో ఎమ్మెల్యే మైనార్టీ సోదరులకు వివిధ రకాల పండ్లు& ఖజూర్ లతో ఉపవాస దీక్షను విరమింప చేశారు.అనంతరం మసీదులో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు, ఇట్టి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ మసీదుల అధ్యక్షులు , షరీఫా మసీద్ కమిటీ సభ్యులు, మక్తల్ మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.