మన న్యూస్, చిత్తూరు :- శుక్రవారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు,లైసెన్స్ ఇంజనీర్లతో సమావేశాన్ని నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ సంబంధించి లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు.నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే అక్రమ కట్టడాలను టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు వార్డుల్లో పర్యటించి గుర్తించి ఆపడమే కాకుండా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.అక్రమ కట్టడాలు, రోడ్ల ఆక్రమణలతో పాటు మున్సిపల్ స్థలాలు ఎక్కడైనా ఆక్రమణలకు గురైతే సంబంధిత సెక్రటరీలపై చర్యలు తప్పవన్నారు.టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు సక్రమంగా విధులు నిర్వహించాలని చెప్పారు.ఈ సమావేశంలో ఏసీపి శుభప్రద,సచివాలయం సిబ్బంది మరియు లైసెన్స్ ఇంజినీర్లు పాల్గొన్నారు.