Mana News :- వెంకటాచలం మండలం సర్వేపల్లి ప్రాంతంలోని అంజనేయ స్వామి గుడి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును నేరుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు కాగా, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.