ఉప్పల్, మన న్యూస్ నవంబర్ 11
ఉప్పల్ నియోజకవర్గం లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీ ఎదురుగా చైతన్య,మురళి సంయుక్త నేతృత్వంలోని ఆహా కిచెన్స్ ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిధులుగా స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ హాజరై యాజమాన్యంను అభినందించారు.ఈ సందర్బంగా యాజమాన్యం మాట్లాడుతూ టిఫిన్స్,మీల్స్, చైనీస్, ,వెజ్,నాన్ వెజ్ బిర్యాని అందరికి అందుబాటు ధరల్లో ఉన్నాయన్నారు.భోజన ప్రియులకు రుచికరమైన,ఆహారాన్ని అందించే లక్ష్యంగా తాము ఆహా కిచెన్స్ ను ఏర్పాటు చేశామన్నారు.ఈ కార్యక్రమం లో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.