మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం నగర పంచాయితీ పరిధిలో మరియు ఏలేశ్వరం మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా శంకుస్థాపన చేశారు. ఏలేశ్వరం నగర పంచాయితీలో నాలుగు కోట్ల రూపాయలతో డిగ్రీ కళాశాలలో చేపట్టనున్న అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగర పంచాయతీ పరిధిలో మురుగు కాలవల్లో పేరుకుపోయిన చెత్తను, మురుగును తొలగించే కార్యక్రమం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.నగర పంచాయతీ పరిధిలో సిసి రోడ్ల నిర్మాణం కోసం మరియు నగర పంచాయతీ ప్రధాన రహదారిలో ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు కోసం శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్య ప్రభ మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్ఆర్సిపి పాలనలో ఐదేళ్లుగా నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోక అన్ని రంగాలలో వెనకబడిపోయిందని అన్నారు.ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతుంది అన్నారు. అభివృద్ధి ,సంక్షేమం సమాంతరంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. నియోజకవర్గంలో సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి,నిధులు తీసుకురావడం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నానని ఆమె అన్నారు.నియోజవర్గ సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినప్పుడు వారు సానుకూలంగా స్పందించి, వెంటనే సమస్య పరిష్కారానికి సహకరిస్తున్నారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇంచార్జి వరుపుల తమ్మయ్య బాబు,నగర పంచాయితీ చైర్మన్ అలమండ సత్యవతి,కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి,మూది నారాయణస్వామి,కూటమి నాయకులు పెంటకోట మోహన్,బస్సా మహాలక్ష్మి ప్రసాద్, మైరాల కనకారావు మరియు ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...