Mana News :- హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీలోని బహదూర్‌పురాలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లారీ మెకానిక్ వర్క్‌షాప్‌లో చెలరేగిన మంటలు సమీపంలోని చెట్లకు వ్యాపించాయి. ఆ తర్వాత పక్కనవున్న భవనాలకు వ్యాపించడతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తుండటంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. అగ్రి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, గతంలో కూడా ఇదే మెకానిక్ వర్క్ షాప్లోఅగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు, గోల్కొండలోని ఫోర్డ్ కార్ల షోరూంలోనూ గురువారం రాత్రి అగ్నిచోటు చేసుకుంది. దీంతో మూడు కార్లు దగ్ఘమయ్యాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు.