మనన్యూస్,నెల్లూరు:మూలపేట శ్రీ పొట్టి శ్రీరాములు బొమ్మ దగ్గర శ్రీ లక్ష్మీనరసింహ ప్రొవిజన్& ఫ్యాన్సీ షాపు గురువారం ఉదయం సిఐ కోటేశ్వరావు,తెలుగుదేశం నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి ప్రారంభించినారు.ఈ సందర్భంగా కేతం రెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ సోదరుడు హేమంత్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహ ప్రొవిజన్స్ & ఫ్యాన్సీ షాపు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.నెల్లూరులోనే తక్కువ ధరలకు నాణ్యమైన, తాజా నిత్యవసర సరుకులు,ఫ్రీ హోమ్ డెలివరీ ఇవ్వడం జరుగుతుందని అని అన్నారు.ఈ షాపు అభివృద్ధి పథంలో,అధిక లాభాలతో నడవాలని,ఇలాంటి షాపులు మరెన్నో ప్రారంభించాలని కోరుకుంటున్నాను అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హేమంత్ బంధుమిత్రులు,శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.