మనన్యూస్,కామారెడ్డి:హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నేడు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మరియు బాలికల ఉన్నత పాఠశాల లింగంపేట్ లో విజయ స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కార్యక్రమాన్ని ఉద్దేశించి హెల్పింగ్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు రజనీకాంత్ గౌడ్,కృష్ణకర్,సత్యనారాయణ రెడ్డిలు మాట్లాడుతూ కెరీర్ గైడెన్స్ లో భాగంగా పదవ తరగతి తర్వాత గల విద్యా ఉద్యోగ అవకాశాల గురించి వివరిస్తూ విద్యార్థులందరూ చాలా బాగా చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని తెలియజేశారు.మండల విద్యాధికారి షౌకత్ అలీ మాట్లాడుతూ కార్యక్రమానికి సహకరించి హెల్పింగ్ బ్రిడ్జి ఫర్ ఎడ్యుకేషన్ ద్వారా విద్యార్థులందరికీ పరీక్షా కిట్లను అందజేసిన రాజారాం నాగరాజు గారిని అభినందించారు.పాఠశాల ఉపాధ్యాయులు వహీద్ సిద్ధికి మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా విద్యార్థులకు సేవలు అందిస్తున్న హెల్పింగ్ బ్రిడ్జి ఫర్ ఎడ్యుకేషన్ సంస్థను కొనియాడారు.లింగంపేట్ గ్రామస్తులు రాజారాం నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి ఇష్టంతో చదివి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అపర్ణ గంగాధర్,సూర్య తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు