Mana News :- విజయవాడ: నగరంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. విజయవాడ టీచర్స్ కాలనీలోని సాయిబాబా గుడి వీధిలో భవన నిర్మాణానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు. ఏపీలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో ఈ భవన నిర్మాణం చేపట్టారు. జీప్లస్ 5 అంతస్తులతో అధునాతన భవనాన్ని నిర్మించనున్నారు. ఇదే భవనంలో తలసీమియా కేర్ సెంటర్, రక్త నిధి కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తదితరులు పాల్గొన్నారు.