Mana News :- విడదల రజిని.. పరిచయం అవసరం లేని పేరు. చిన్న వయసులోనే మంత్రి పదవి దక్కించుకొని.. స్పెషల్ అనిపించుకున్నారు. కట్ చేస్తే గత ఎన్నికల్లో ఓటమి.. రజినికి అన్ని రకాలుగా చుక్కలు చూపిస్తోంది. ఓవైపు కేసులు.. మరోవైపు అవినీతి ఆరోపణలు.. ఇంకోవైపు పార్టీలో సీన్.. పరిస్థితులు రజినితో ఫుట్‌బాల్ ఆడుతున్నాయ్. ఇప్పుడు ఏసీబీ కేసులో ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. అసలు విడదల వాట్ నెక్ట్స్.. రాబోయే రోజుల్లో మరిన్ని చుక్కలు చూడడం ఖాయమా..మొన్న వంశీ.. నిన్న పోసాని.. నెక్ట్స్ ఎవరు ! ఏపీలో వరుస అరెస్ట్‌ల వేళ వినిపిస్తున్న ప్రశ్న ఇది. అధికారం అడ్డం పెట్టుకొని చాలామంది వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తున్న కూటమి సర్కార్.. ఒక్కొక్కరి లెక్కలు తేలుస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య మాజీ మంత్రి విడదల రజిని చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది. దీంతో త్వరలోనే ఆమె జైలుకెళ్లక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయ్. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే అన్నీ సిద్ధం చేయగా.. కొన్ని అనుమతులు రావాల్సి ఉందని తెలుస్తోంది. 2019లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రజిని.. జగన్ సెకండ్ కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. వైద్యారోగ్య శాఖా మంత్రిగా పని చేశారు. 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్‌కు మారిపోయి.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఓటమి తర్వాత అటు పార్టీలోనూ.. ఇటు పర్సనల్‌గా రజినికి కష్టాలే ఎదురవుతున్నాయ్. ఇప్పుడు ఏసీబీ ఉచ్చు బిగుసుకునే పరిస్థితి కనిపిస్తోంది.