మనన్యూస్,కామారెడ్డి,రామారెడ్డి:ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మృతి చెందిన మూడు కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 4 వేల రూపాయలు ,30 కిలోల బియ్యం ఇవ్వడం జరిగిందని ఈసన్నపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కందూరి బాలమని అన్నారు ఈ సందర్భంగా ఈసన్నపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బాలమని లింబద్రి మాట్లాడారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ధరణి నర్సింలు ,సిద్ధం బైరయ్య కుటుంబాన్ని పరామర్శించి ఒక కుటుంబనికి 4 వేల రూపాయలు 30 కిలోల బియ్యాన్ని అందించడం జరిగిందని, బొంపల్లి సంతోష్ కుటుంబాన్ని పరామర్శించి 4 వేల రూపాయలు 30 కిలోల బియ్యాన్ని అందించడం జరిగిందని తెలిపారు ధరణి నర్సింలు అప్పుల బాధతో మృతి చెందిన విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని. ఈ విషయం బ్యాంకు మేనేజర్ తో స్వయంగా ఎమ్మెల్యే మాట్లాడి వారి కుటుంబానికి న్యాయం చేద్దామని అన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొక్కొండ రాజేందర్. ధరణి మల్లయ్య, రెడ్డి మహిపాల్,ధరణి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.