మన న్యూస్, ఎస్ఆర్ పురం గంగాధర నెల్లూరు :- వెదురుకుప్ప మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి 17 కోట్ల 82 లక్షల 50 వేల రూపాయలతో మంజూరు చేయించిన గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.ఎం థామస్ నేడు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని ముఖ్యమంత్రి కి తెలియజేశారు. వెంటనే ఆయన స్పందిస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు ఆమోదం తెలిపారు. ఈy సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని పరిశ్రమల హబ్బు గా ఏర్పాటు చేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.ప్రతి మండలంలో ఒక పరిశ్రమను ఏర్పాటుకు వివిధ కంపెనీలతో చర్చించడం జరిగిందని అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని అన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి అభివృద్ధి పనుల పేరుతో శంకుస్థాపన చేసి గాలికి వదిలేసారని మండిపడ్డారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల శంకుస్థాపన చేసి ఐదు సంవత్సరాలుగా ఎటువంటి పనులు చేయలేదు అక్కడ శంకుస్థాపన పేరుతో రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి 17 కోట్ల 82 లక్షల 50 వేల నిధులు ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు ఆమోదం తెలపడం జరిగిందన్నారు. అనంతరం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం థామస్ కు అభినందనలు తెలిపారు.