Mana News, హైదరాబాద్: మంత్రి దామోదర రాజనర్సింహా గాంధీ ఆసుపత్రిలో ఆకస్మికంగా పర్యటించారు. నేరుగా అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్లి, ఓపీలో ఉన్న పేషెంట్లతో మాట్లాడారు. డాక్టర్ల అటెండెన్స్ షీట్ తెప్పించుకుని పరిశీలించారు. ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.