Mana News :- తిరుమల మెట్ల మార్గంలో సోమవారం రాత్రి చిరుత పులి కదలికలు కనిపించాయి. అర్ధ రాత్రి దాటాక గాలిగోపురం వద్ద గల ఒక షాపులో చిరుత కదలికలు రికార్డ్ అయ్యాయి. అటుగా వచ్చిన చిరుత కుక్కపిల్లను ఎత్తుకెళ్లింది. ఈ ఘటనపై టిటిడి అధికారులు స్పందించాల్సి ఉంది. తిరుమలలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. మెట్ల మార్గంలో ఇటీవల చిరుత సంచరించినట్లు తెలియడంతో అప్పటి నుంచి ఫారెస్ట్ సిబ్బంది చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తాజాగా మంగళవారం తెల్లవారుజామున అలిపిరి నడకదారి సమీపంలో చిరుత పులి కనిపించింది. చిరుత సంచారం దృశ్యాలు అక్కడున్న సీసీ టీవీ పుటేజీలో రికార్డు అయ్యాయి.