మనన్యూస్,తిరుపతి:ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ లోని వివేక్ హోటల్ నందు లాక్రోస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2025 నుంచి 2029 వ సంవత్సరం వరకు నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికలకు 22 రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ లాక్రోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి.మునికృష్ణయ్య మరియు ప్రధాన కార్యదర్శి ఎం సురేంద్ర రెడ్డి హాజరయ్యారు లాక్రోస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడుగా గోరఖ్పూర్ ఎంపీ,సూపర్ స్టార్ నటుడు రవి కిషన్ శుక్లాని మరియు ప్రధాన కార్యదర్శిగా నవీజ్ ఆలం కోశాధికారిగా రాజ్ కుమార్ కైత్వాస్ సీఈఓ గా తౌసిఫ్ అహ్మద్ లారీ ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మాట్లాడుతూ లాక్రోస్ గేమ్ 2028 లాస్ ఏంజెల్స్ లో నిర్వహించే ఒలంపిక్ గేమ్స్ లో ఉండడం చాలా ఆనందదాయకం అని తెలిపారు త్వరలో భారత దేశంలో అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్ లు నిర్వహించడానికి సహకరిస్తామని తెలియజేశారు లాక్రాస్ గేమ్ కు ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ మరియు స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి త్వరలో అనుమతులు వచ్చేలా సహకరిస్తానని తెలియజేశారు ఈ కిడను త్వరలో ఖేలో ఇండియా మరియు స్కూల్ గేమ్స్ లో కూడా చేర్చుటకు నా వంతు సహారా అందిస్తారని అందరికీ తెలియజేస్తున్నాను తెలిపారు ఈ ఎన్నికలకు అబ్జర్వర్ గా ఆసియ లాక్రాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రిష్ కిలో జపాన్ నుండి ఆన్లైన్లో ఇండియన్ లాక్రాస్ అసోసియేషన్ ఎన్నికలను పరిశీలించారు ఈ ఎన్నికల అధికారిగా హలో దివేది & లాయర్ యస్వీర్ సింగ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ జరిగింది ఎన్నికైన సభ్యులను ఏపీ లాక్రోస్ అసోసియేషన్ తరపున హర్షం వ్యక్తం చేశారు