మనన్యూస్,తిరుపతి:ఈ నెల 14వ తేది పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.జనసైనికులు, యువకులు,వీరమహిళలు,పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరూ సభకు హాజరై దేశంలో కనివిని రీతిలో జయప్రదం చేయాలని ఆయన కోరారు.ఈ నెల12,13,14 తేదీల్లో పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయడంపై తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఇన్చార్జిలతో సన్నాహత సమావేశాన్ని పార్లమెంట్ సమన్వయ కర్త హోదాలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన నివాసంలో సోమవారం సాయంత్రం నిర్వహించారు.ప్రతి నియోజకవర్గం నుంచి 300 మందికి తగ్గకుండా పార్టీ నాయకులు,కార్యకర్తలు సభకు హాజరు అయ్యో ల చూడాలని ప్రాథమికంగా నిర్ణయించారు.అయితే కొంతమంది నియోజకవర్గ ఇన్చార్జీలు ఐదు వందల మందిని సభకు తరలించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యేకు తెలిపారు.ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయడంపై సన్నాహక సమావేశంలో చర్చించినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.తిరుపతి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి పిటాపురానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు అవసరమైన
ఏర్పాట్లు పైనా చర్చినట్లు ఆయన చెప్పారు.దేశ రాజకీయాల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి రికార్డు సృష్టించినట్లే ఆవిర్భవ దినోత్సవాన్ని విజయవంతం చేస్తామని ఆయన తెలిపారు.జనసేన చీఫ్,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నేతలకు,కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి తోట వినూత,సత్యవేడు ఇన్చార్జి లావణ్య కుమార్,తిరుపతి నుంచి రాజా రెడ్డి,సర్వేపల్లి ఇన్చార్జి సురేష్ నాయుడు,గూడూరు ఇన్చార్జి మునిగిరిష్,వెంకటగిరి ఇన్చార్జి ప్రకాష్, సూళ్లూరుపేట ఇన్చార్జి మహబూబ్ బాషా,చంద్రగిరి ఇన్చార్జి దేవర మనోహర్,రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు తమ్మినేని వెంకటేశ్వర రావు,ఆకేపాటి సుభాషిణి,హేమకుమార్,చంద్రబాబు,మధుబాబుహరిశంకర్,పుటుకూరి ఆనంద్,విజయ్ కుమార్,తోట కృష్ణయ్య,ఆకుల వనజ తదితరులు.