మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి.
మామిడి సీజన్ కి సంబంధించి అన్ని విభాగాల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం
మనన్యూస్,అబ్దుల్లాపూర్ మెట్:బాటసింగారం పండ్ల మార్కెట్ లో మామిడి దిగుమతులు వస్తున్న నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం కార్యాలయం ఆవరణలో మామిడి వ్యాపారస్తులు,సంబంధిత అన్ని శాఖల అధికారులు,మార్కెట్ సిబ్బంది,పాలకవర్గం తో కలిసి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా మామిడి వ్యాపారులు సీజన్ లో ఎదుర్కొంటున్న సమస్యలను,సలహాలను తెలియచేయడం జరిగింది.వారు తెలియపర్చిన సమస్యలకు అధికారులు పాలకవర్గం సమాధానం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద మామిడి దిగుమతులు ఎగుమతులు బాటసింగారం పండ్ల మార్కెట్ లో జరుగుతున్నాయని,ఈ సంవత్సరం ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తామని రైతులు,వ్యాపారులు,అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటామని అన్నారు.కనీస వసతులు కలిపిస్తామని,రైతులకు విశ్రాంతి,వైద్య సేవలు,ట్రాఫిక్,లా అండ్ ఆర్డర్ వంటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.ఎప్పడు లేని విధంగా ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపడతామని అన్నారు.గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఒక కుటుంబంలా ఉండి ఎక్కడ సమస్య ఉన్న దగ్గరుండి పరిష్కరిస్తామని అన్నారు.అధిక కమీషన్లు వసూలు చేస్తే మార్కెట్ లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ అంజిరెడ్డి,ట్రాఫిక్ సీఐ గట్టుమల్లు,ఫైర్ స్టేషన్ సీఐ యాదగిరి,మార్కెట్ వైస్ చైర్మన్ బాస్కర చారి,మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్,పాలకవర్గం సభ్యులు బండి మధుసూదన్ రావు,రఘుపతి రెడ్డి,జైపాల్ రెడ్డి.అంజయ్య,లక్ష్మి,నరసింహ,గోవర్ధన్ రెడ్డి,నవరాజ్,గణేశ్ నాయక్,మచ్చెందర్ రెడ్డి,వెంకటేశ్వర్లు గుప్తా,ఇబ్రహీం తో పాటు మార్కెట్ కమిటీ అధికారులు,పలువురు వ్యాపారులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.