మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:డ్రైవర్ ఎస్.వి.రమణ అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని కోరుతూ ఏలేశ్వరం ఆర్టీసీ డిపో లో ఉన్న అన్ని యూనియన్లు జేఏసీగా ఏర్పడి సోమవారం నుండి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు జేఏసీ కన్వీనర్ కే త్రిమూర్తులు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 1/2019 జీవో కు వ్యతిరేకంగా డిపో మేనేజర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డ్రైవర్ జీవి రమణ ను జీవో కు వ్యతిరేకంగా సస్పెండ్ చేయడానికి నశిస్తూ గత పది రోజులుగా ఎర్ర రిబ్బలు ధరించి విధులకు హాజరై మధ్యాహ్నం డిపో గేట్ మీటింగ్ లో నిరసన వ్యక్తం చేస్తున్న డిపో మేనేజర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.ఇప్పటికైనా డిపో మేనేజర్ జీవో 1/2019 ఖచ్చితంగా అమలు చేసి డ్రైవర్ ఎస్.వి.రమణ తిరిగి విధులలోనికి తీసుకోవాలని అలా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.