మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు పార్టీలో కార్యకర్తలకు అండగా నిలవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జి,రాష్ట్ర కార్యదర్శి కాశి రాజులు పిలుపునిచ్చారు.ఈ మేరకు కాకినాడ లో బోట్ క్లబ్ వద్ద గల చోడే వారి ప్రకృతి వైద్యాలయం నందు సమావేశం బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ జిల్లా సమావేశం నిర్వహించారు.కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ కొత్తగా నియమించిన మండల అధ్యక్షులు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధులుగా బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ,రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాశి రాజు లు ఇచ్చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా నియమించబడిన కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన మండల అధ్యక్షులు పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడాలని తద్వారా పార్టీ ప్రజల్లో మరింత బలవపేతం అవుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ మరియు కాకినాడ పార్లమెంటరీ ఇంచార్జి రావూరి సుధ, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జి మట్టు మంగ రాజు,భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మిడి వెంకట్రావు,ప్రత్తిపాడు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ సింగిలిదేవి సత్తిరాజు,ప్రత్తిపాడు మండల అధ్యక్షులు ఊట వీరబాబు, రౌతులపూడి నియోజకవర్గ మండల అధ్యక్షులు లౌడ్ శ్రీను,జిల్లా ఎస్టి సెల్ మోర్చ అధ్యక్షులు కించు జోగిరాజు మరియు తదితరులున్నారు.