మనన్యూస్,నెల్లూరు:మార్చి 9న 105 శంకుస్థాపనల కార్యక్రమం చరిత్ర సృష్టించే కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము.కార్యకర్తల కష్టం,కన్నీళ్లు నాకు తెలుసు.కార్యకర్తల ప్రయోజనాలే నాకు ముఖ్యం.వారికోసం ఎందాకైనా వస్తా.ప్రజలకు పనికివచ్చే పనులు చేయండి. రాజకీయ వేధింపులు వద్దు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 9 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పనులకు 191 కోట్ల నిధులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ అర్బన్ డివిజన్ల నాయకులు,కార్యకర్తలతో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. భారతదేశ చరిత్రలో ఒకేరోజు 105 శంకుస్థాపనలు.స్థానిక ప్రజలే శంకుస్థాపకులు. ఉదయం 6:30 కే తొలి శంకుస్థాపన కార్యక్రమం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.51 చోట్ల నేనే స్వయంగా పాల్గొంటా.54 చోట్ల కూటమి పార్టీ నేతలతో కలసి నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొంటారు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.కేవలం 60 రోజుల్లో ఈ పనులను పూర్తిచేసి,ప్రజలచేతే ఘనంగా ప్రారంభోత్సవాలు చేస్తాం.రాష్ట్రానికే ఆదర్శంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నిలుపుదాం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.ఎక్కడా హంగు,ఆర్భాటాలు వద్దు.మార్చి 9న కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోండి.చరిత్ర సృష్టించే కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.కార్యకర్తల కష్టం కన్నీళ్లు నాకు తెలుసు.కార్యకర్తల ప్రయోజనాలే నాకు ముఖ్యం. వారికోసం ఎందాకైనా వస్తా.ప్రజలకు పనికివచ్చే పనులు చేయండి.రాజకీయ వేధింపులు వద్దు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంఛార్జులు,కార్పొరేటర్లు,డివిజన్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.