తిరుపతి, నవంబర్ 11, (మన న్యూస్ ) :- తిరుపతి కరకంబాడి రోడ్డు నందలి వినాయకసాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం వాకర్స్ సభ్యులతో కార్తీక వనభోజనమహోత్సవాన్ని వడమాలపేట మండలం ఉమామహేశ్వరాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ విచ్చేసారు.
ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తిరుపతిలో ఎన్నో వాకర్స్ అసోసియేషన్లు ఉన్న వినాయకసాగర్ వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గం చేస్తున్న సామజిక కార్యక్రమాలు ఎవ్వరికీ సాటిరారని తెలిపారు. సుమారు 300 మంది సభ్యులతో కలసి శివునికి అభిషేకించి తీర్థప్రసాదాలను వాకర్స్ కు అందజేశారు. ఆలయం ఆవరణంలోనే భోజనాలు వండి అందరికి వడ్డించారని తెలియజేసారు.చివరగా వాకర్స్ సభ్యులకు జ్ఞాపిక ను , నూతన సంవత్సర డైరీ, కాలెండర్ల ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్, సంకల్ప హాస్పిటల్ డైరెక్టర్ బండ్ల సోమేశ్ , వి. జగన్నాధం , వినాయకసాగర్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు బాలాజీ , శివారెడ్డి , సాయి కృష్ణంరాజు, చంద్ర ,నరసింహయ్య ,శాంతి, పుష్పలత, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు