బంగారుపాళ్యం మార్చి 1 మన న్యూస్
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం లో శనివారం పాలేరు పంచాయతీ గుడి ప్రక్కనగల కళ్యాణమండపం నందు వైఎస్ఆర్సిపి కార్యకర్తల సమావేశం మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి పూతలపట్టు నియోజవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే లలిత థామస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 9 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ అరాచకాల పైన, పట్టణాల్లో గ్రామాల్లో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలపై ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్క వైఎస్సార్సీపి కార్యకర్తకు అండగా ఉంటామని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్, లలితా థామస్ తెలిపారు. మండల కన్వీనర్ పాలేరు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ 9 నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఇంతవరకు నెరవేర్చకపోవడం మనం చేసుకున్న పాపం అని ఆయన మండిపడ్డారు. వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఎన్నో పార్టీలను చూసాము కానీ, ఇంతటి దురాక్రమణ చేస్తున్నటువంటి పాలనను ఎప్పుడూ చూడలేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేయడంతో ప్రజలు తిరిగి వైఎస్ఆర్సిపి పార్టీని కోరుకుంటున్నారని, ఇటువంటి రౌడీయిజం ఎంతకాలం పనిచేయదని ఆయన కార్యకర్తల సమావేశంలో తెలిపారు. కార్యక్రమంలో జడ్పిటిసి సోమశేఖర్, రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, పాలాక్షి రెడ్డి, ప్రభు నాయుడు, థామస్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి, జిల్లా ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షులు షేక్ ఫిరోజ్ అహ్మద్, మండల ఎస్సీ సెల్ నాయకులు ఇ.నాగరాజు, మండల యువత అధ్యక్షులు గజేంద్ర ఎంపిటిసిలు సర్పంచులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు