తవణంపల్లి మార్చి 1 మన న్యూస్
చిత్తూరుజిల్లాపూతలపట్టుతవణంపల్లి: గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో అపోలో గ్రూప్ చైర్మన్ పద్మ విభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ఏర్పాటుచేసిన అక్షయ ధార పథకంలో భాగంగా మండలంలోని గల్లా వాళ్ళ ఊరు , ఎగుతడకర పంచాయతీ వెంకటాపురం గ్రామాలలో ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్లను అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ గురుకువారిపల్లి నరోత్తం రెడ్డిశనివారంప్రారంభించారు ఈ సందర్భంగా నరోత్తం రెడ్డి మాట్లాడుతూఅపోలో గ్రూప్ చైర్మన్ పద్మవిభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి తన సొంత మండలానికి మంచి చేయాలనిఎంతోప్రతిష్టాత్మకంగా అరగొండ అపోలో సంపూర్ణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ ఆరోగ్య కేంద్రం ద్వారా మండలంలో పలుసేవాకార్యక్రమాలనునిర్వహిస్తున్నామనితెలిపారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజలకి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ఉద్దేశంతో అపోలో గ్రూప్ ఆధ్వర్యంలో మండలంలో దాదాపు 20 గ్రామాలలో మినరల్ వాటర్ ప్లాంట్లనుఏర్పాటుచేశామనితెలిపారు.ఈసేవాకార్యక్రమాలను చేయడానికి అపోలో గ్రూప్స్ డైరెక్టర్ ఉపాసన ఎంతో ముందుండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని వివరించారుఈకార్యక్రమంలో మండల జడ్పిటిసి భారతి మధు కుమార్ ఎంపీటీసీఇంద్రాణిగంగయ్య నాయకులు గాంధీ బాబు జొన్న గురకల రాజశేఖర్ రెడ్డి టి పుత్తూరు పాలాక్షి రెడ్డి, భూపతి నాయుడు టోటల్ హెల్త్ సి సి ఓరాంబాబు అపోలో ఫార్మసీ డిజిఎం సత్యరెడ్డి అపోలో హాస్పిటల్స్ పి ఆర్ ఓ కమ్రుద్దీన్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు